![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -94 లో..... తాయారు వాళ్ళని టెన్షన్ పెట్టడానికి అబ్బాయి తండ్రి పిలవగానే నారాయణ వాళ్ళు అందరు ఎంగేజ్ మెంట్ కి వెళ్తారు. అక్కడ గాయత్రి, మాధవని చూస్తూ ఉంటుంది. తాయారుకి గాయత్రి ఎదురు చెప్పి ఎంగేజ్ మెంట్ వద్దనుకొని మాధవ దగ్గరికి వెళ్లినట్లు ఉహించుకుంటుంది. ఏంటి రింగ్ తొడుగు అని గాయత్రికి తాయారు చెప్తుంది. ఎందుకు చంపుతావు.. ఇక్కడే ఉన్నా కదా అని అయిష్టంగా రింగ్ తొడుగుతుంది గాయత్రి.
ఇద్దరు ఉంగరాలు మార్చుకుంటారు. అదంతా చూస్తున్న మాధవ గుండె పగిలినంత పని అవుతుంది. మాధవ బాధపడుతుంటే అక్కడ నుండి వెళ్లిపోవాలని అందరు లేస్తారు. మీరు భోజనం చేసే ఇక్కడ నుండి వెళ్ళాలని అబ్బాయి వాళ్ళ నాన్న అంటాడు. దాంతో ఇష్టం లేకున్నా భోజనాల దగ్గరికి వెళ్తారు నారాయణ వాళ్ళు. భోజనాలు చేస్తుంటే తాయారు వచ్చి మీకు కూటికి కూడా గతి లేదు కదా.. ఈ పూట ఏళ్లుతది అని వచ్చారు కదా అని నారాయణ వాళ్ళని అవమానిస్తుంది తాయారు. దాంతో తినే ప్లేస్ నుండి అందరు లేస్తారు. మీరు నా కొడుకు రిసెప్షన్ కీ వచ్చి మంచిగా తిన్నారు. అప్పుడు మేం ఇలాగే లేపామా అని నారాయణ కోప్పడతాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చాక ఒరేయ్ ఇంత మంచితనం పని చెయ్యదురా అబ్బాయి తండ్రికి అసలు నిజం చెప్తే ఎంగేజ్ మెంట్ ఆగిపోయేదని మాధవతో నారాయణ అంటాడు.
అప్పుడు గాయత్రి అవమానంతో చచ్చిపోయేదని మాధవ అంటాడు. ఇంత మంచితనం పని చెయ్యదురా అని చెప్పేసి నారాయణ వెళ్ళిపోతాడు. మరొకవైపు శైలు, కేశవ చేసిన రీల్స్ మిలియన్స్ వ్యూస్ వస్తాయి. అదేంటే ఒక ఆ కేశవతో చేసిన రీల్ మాత్రమే వైరల్ అయిందని శైలు తన ఫ్రెండ్ తో అంటుంది. అప్పుడే ప్రమోషన్ కోసం కాల్స్ వస్తాయి. మరొకవైపు మహా ఆధార్ కార్డ్ తీసుకొని ఒక బుక్ లో రాసుకొని మళ్ళీ ఆధార్ కార్డు బీరువాలో పెడుతుంది. ఆ బుక్ లో రాసిన నెంబర్ మహాకి పంపాలని అనుకుంటుంది. ఫోన్ ఛార్జింగ్ లేకపోవడంతో ఛార్జింగ్ పెడుతుంది. అదంతా చూస్తున్న ఆదికి తన భార్య ఏదో చేస్తున్నదని డౌట్ వచ్చి ఆ బుక్ లో రాసిన ఆధార్ నెంబర్ చేంజ్ చేస్తాడు. ఆ తర్వాత మహాకి ఆధార్ నెంబర్ పంపిస్తుంది హారిక. అది చూసి మహా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఈ నెంబర్ తో ఆధార్ డౌన్లోడ్ చేసుకుంటానని చక్రితో మహా అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |